silicon andhra: కూచిపూడిలో 'సిలికానాంధ్ర సంజీవని' ఆసుపత్రిని ప్రారంభించిన చంద్రబాబు

  • కూచిభొట్ల ఆనంద్ రియల్ లైఫ్ హీరో
  • టీవీ9 రవిప్రకాశ్ కు అభినందనలు 
  • కూచిపూడి అంతర్జాతీయ డెస్టినేషన్ గా తయారవుతుంది

కృష్ణా జిల్లా కూచిపూడిలో నిర్మించిన సిలికానాంధ్ర సంజీవని ఆసుపత్రిని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సుప్రీకోర్టు మాజీ జడ్జి జస్టిస్ చలమేశ్వర్, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, టీవీ9 సీఈవో రవిప్రకాశ్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, అన్ని వసతులతో ఆసుపత్రిని నిర్మించారని కొనియడారు. ఆసుపత్రిని నిర్మించిన కూచిభొట్ల ఆనంద్ రియల్ లైఫ్ హీరో అని చెప్పారు.

మంచిపని చేయాలనుకున్నప్పుడు అందరి సహకారం తప్పకుండా అందుతుందని అన్నారు. టీవీ9 ద్వారా విరాళాలను సేకరించడం స్ఫూర్తిదాయకమని చెప్పారు. ఆసుపత్రి నిర్మాణం కోసం విరాళాలు ఇచ్చిన వారంతా చరిత్రలో నిలిచిపోతారని తెలిపారు. కూచిపూడి అంతర్జాతీయ డెస్టినేషన్ గా తయారవుతుందని అన్నారు. ఈ ఆసుపత్రి నిర్మాణంలో భాగస్వాములైన కూచిభొట్ల ఆనంద్, టీవీ9 రవిప్రకాశ్ లను అభినందిస్తున్నానని చెప్పారు. 

silicon andhra
hospital
Chandrababu
tv9
raviprakash
  • Loading...

More Telugu News