Virat Kohli: నేను నటించని సినిమాకొచ్చిన నకిలీ ‘ఆస్కార్’ ఇది: విరాట్ కోహ్లీ చమత్కారం

  • ఓ సినిమాలో నటిస్తున్నానని గతంలో కోహ్లీ సరదా ట్వీట్
  • అదంతా అబద్ధమేనంటూ తాజా ట్వీట్
  • నేను నటించని ట్రైలర్ సినిమాను చూడని ప్రేక్షకులకు ధన్యవాదాలు

సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఒక్కోసారి.. సరదా పోస్ట్ లు చేసిన సందర్భాలు లేకపోలేదు. అలా, సరదాగా చేసిన ఓ పోస్ట్ గురించి ప్రస్తావించాలి. గత నెలలో ట్విట్టర్ వేదికగా కోహ్లీ చేసిన ఈ పోస్ట్ లో ‘ఓ సినిమాలో నటిస్తున్నాను. ఆ చిత్రం పేరు ‘ట్రైలర్’. నిర్మాత వ్రాన్ ప్రొడక్షన్స్’ అంటూ తన స్టిల్ తో ఉన్న ఓ పోస్టర్ ను కోహ్లీ ట్వీట్ చేశాడు.

ఇది, నిజమేనని నమ్మిన అభిమానులు ఆశ్చర్యపడటమే కాకుండా సంతోషమూ వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, ఈ ట్వీట్ గురించి కోహ్లీ ప్రస్తావిస్తూ తాజాగా ఓ వీడియో పోస్ట్ చేసి అభిమానులను మళ్లీ ఆశ్చర్యపడేలా చేశాడు. ‘నేను నటించని ట్రైలర్ సినిమాకు వచ్చిన నకిలీ ‘ఆస్కార్’ ఇది. ఈ సినిమాను నిర్మించని వ్రాన్ ప్రొడక్షన్ కు, ఈ చిత్రాన్ని చూడని ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇది ఫేక్ చిత్రం కనుక ఇది ఫేక్ ‘ఆస్కార్’’ అని ఆ వీడియోలో కోహ్లీ అసలు విషయం చెప్పేశాడు.


 

  • Error fetching data: Network response was not ok

More Telugu News