Chandrababu: సిక్కోలు వాసులను జగన్ పరామర్శించకపోవడం సిగ్గుచేటు: ఎంపీ రామ్మోహన్ నాయుడు

  • పక్క జిల్లాలో ఉండీ పరామర్శించరే?
  • బాబు ఆలోచనలకు మనం అండగా ఉండాలి
  • సిక్కోలుపై ప్రతిపక్షాలు రాజకీయాలు చేయొద్దు 

శ్రీకాకుళం జిల్లాలో ‘తిత్లీ’ తుపాన్ బాధితులను వైసీపీ అధినేత జగన్ పరామర్శించకపోవడంపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శలు గుప్పించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రతిపక్షనేతగా ఎలా ఉండాలో గతంలో చంద్రబాబునాయుడు నిరూపించారని అన్నారు.

గతంలో ఉత్తరాఖండ్ లో వరదలొచ్చినప్పుడు తెలుగు వారికి చంద్రబాబు అండగా నిలబడ్డ విషయాన్ని ప్రస్తావించారు. కానీ, ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ పక్క జిల్లాలో ఉండి కూడా సిక్కోలు వాసులను పరామర్శించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. చంద్రబాబు ఆలోచనలకు మనం అండగా ఉండాలని, సిక్కోలుపై రాజకీయాలు చేయొద్దని ప్రతిపక్షాలను కోరుతున్నామని, అందరం కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామని కోరారు.

Chandrababu
Jagan
rammohan naidu
  • Loading...

More Telugu News