sangareddy: కళ్లున్న ధృతరాష్ట్రుడు కేసీఆర్: సంగారెడ్డి నేత జగ్గారెడ్డి

  • ఈ పరిపాలనకు స్వస్తి చెబుతాం
  • ఉత్తమ్ నాయకత్వంలో అధికారంలోకొస్తాం
  • పాండవుల పరిపాలనను ఐదేళ్లు అందిస్తాం

తెలంగాణ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్రంలో ఒక ధృతరాష్ట్రుని పాలన కొనసాగిందని టీ-కాంగ్రెస్ సంగారెడ్డి నేత జగ్గారెడ్డి విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కళ్లు లేని ధృతరాష్ట్రుడు ఆ రోజున కౌరవసామ్రాజ్యాన్ని ఏ విధంగానైతే నడిపించాడో, కళ్లున్న ధృతరాష్ట్రుడు కేసీఆర్ ఈరోజున ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని మండిపడ్డారు. ఈ పరిపాలనకు స్వస్తి చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొస్తుందని, పాండవుల పరిపాలనను ఐదేళ్ల పాటు అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని అన్నారు.

sangareddy
jaggareddy
kcr
Uttam Kumar Reddy
  • Loading...

More Telugu News