sabari mala: తెరచుకున్న శబరిమల తలుపులు.. పోటెత్తిన భక్తులు!

  • నెలవారీ పూజల కోసం తెరిచిన ఆలయం
  • మహిళలను అడ్డుకుంటున్న ఆందోళనకారులు 
  • ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు  

నెలవారీ పూజల్లో భాగంగా శబరిమల ఆలయ తలుపులు కొద్ది సేపటి క్రితం తెరచుకున్నాయి. అయ్యప్పస్వామి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. ఆలయంలోకి మహిళలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మహిళా భక్తులు కూడా దర్శనం చేసుకోవాలని భావిస్తున్నారు.

అయితే, శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించరాదంటూ బీజేపీ, శివసేన కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. మహిళలు వెళ్లకుండా ఆందోళనకారులు అడ్డుకుంటున్నారు. ఈ దృశ్యాలను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులు, మహిళా పాత్రికేయులపైనా వారు దాడికి పాల్పడ్డట్టు సమాచారం. నీలక్కళ్, పంబ దగ్గర ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు.


sabari mala
ayyapaswamy
bjp
sivasena
  • Loading...

More Telugu News