sailaja: శ్రీదేవి పాత్రకి డబ్బింగ్ చెప్పడం కష్టమైంది!: ఎస్.పి. శైలజ
- చాలా సినిమాలకి డబ్బింగ్ చెప్పాను
- 'వసంత కోకిల'కి చెప్పడం ఇబ్బందయింది
- ఆ పాటలంటే నాకు చాలా ఇష్టం
తెలుగులో ఎన్నో సినిమాలకి శైలజ పాటలు పాడారు. మరెన్నో చిత్రాలలోని కథానాయికలకు ఆమె డబ్బింగ్ చెప్పారు. అలాంటి శైలజ తాజాగా 'వనిత' టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. "కొన్ని సినిమాల్లోని కథానాయికల పాత్రలు చాలా విభిన్నంగా ఉంటాయి. అలాంటి పాత్రలకు డబ్బింగ్ చెప్పడం కష్టమయ్యేది.
'వసంత కోకిల' సినిమాలో శ్రీదేవి పాత్రకి చిన్నపిల్ల వాయిస్ తో డబ్బింగ్ చెప్పాలి. అదే వాయిస్ ను కంటిన్యూ చేస్తూ డబ్బింగ్ చెప్పడం చాలా ఇబ్బంది అయింది. ఇక నేను పాడిన పాటల్లో నాకు నచ్చిన పాటలు కొన్ని వున్నాయి. 'జాతర' సినిమాలో .. 'మాఘమాస వేళలో' .. 'శుభసంకల్పం' సినిమాలో 'చినుకులన్నీ కలిసి' ..'సాగర సంగమం' సినిమాలో 'వేదం .. ' సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం" అని చెప్పుకొచ్చారు.