lady herashed: మహిళ ఫేస్‌బుక్‌ అకౌంట్‌కు అశ్లీల చిత్రాలు పంపి వేధిస్తున్న యువకుడి అరెస్టు

  • వద్దని వేడుకున్నా వినక పోవడంతో పోలీసులకు ఫిర్యాదు
  • నిందితుడు పందొమ్మిదేళ్ల యువకుడు
  • సాంకేతిక సమాచారం ఆధారంగా పట్టుకున్న సైబర్‌ క్రైం సిబ్బంది

తన ఫేస్‌బుక్‌ స్నేహితురాలి ద్వారా పరిచయమైన మరో మహిళ అకౌంట్‌కు అశ్లీల చిత్రాలు పోస్టింగ్‌ చేస్తూ వేధిస్తున్న యువకుడిని రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులు పట్టుకున్నారు. ఇన్‌స్పెక్టర్‌ జలేందర్‌ రెడ్డి కథనం మేరకు రంగారెడ్డి జిల్లా నాగోలు పట్టణం సంతోష్‌నగర్‌లోని రియాసత్‌నగర్‌కు చెందిన ఎం.డి.అజహర్‌ఖాన్‌ (19) ఇంటర్‌ వరకు చదివి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు.

బీదర్‌కు చెందిన ఓ మహిళ నాగోలు ఈసీఐఎల్‌ ప్రాంతంలో నివాసం ఉంటోంది. తన ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌ ద్వారా అజహర్‌ఖాన్‌ ఈమెతో స్నేహం ప్రారంభించాడు. ఓ సందర్భంలో ఆమెతో చాటింగ్‌ చేస్తుండగా అజహర్‌ఖాన్‌ తీరుతో ఆమె మండిపడింది. వార్నింగ్‌ ఇచ్చింది. దీంతో కక్ష పెంచుకున్నాడు. అజహర్‌ఖాన్‌ నెట్‌ నుంచి నగ్న చిత్రాలు డౌన్‌లోడ్‌ చేసి వాటికి సదరు మహిళ ముఖం మార్పింగ్‌తో జతచేసేవాడు. వాటిని ఆమెకు పోస్టు చేస్తూ గత కొంతకాలంగా వేధిస్తున్నాడు.

వాటిని తొలగించాలని సదరు మహిళ పలుమార్లు ఖాన్‌ను వేడుకున్నా పట్టించుకోలేదు. దీంతో ఆమె సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించింది. అజహర్‌ఖాన్‌పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక సమాచారం ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు. మొదట్లో తాను కాదని ఆ యువకుడు బుకాయించినా పోలీసులు తాము సేకరించిన రుజువులన్నీ ముందుంచే సరికి నేరాన్ని అంగీకరించాడు. మంగళవారం అజహర్‌ఖాన్‌ ను అరెస్టు చేసి కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.

lady herashed
Ranga Reddy District
nagolu
  • Error fetching data: Network response was not ok

More Telugu News