cricketer srisanth: క్రికెటర్‌ శ్రీశాంత్‌ ఏడేళ్లు భవనేశ్వరిని ప్రేమించాడా...మరి నాతో సహజీవనం సంగతేంటి?: నికీషా పటేల్‌ ఫైర్‌

  • మధ్యలో మా వ్యవహారం సంగతి మర్చిపోయాడా?
  • ఓ అమ్మాయిని ప్రేమిస్తూ మరో అమ్మాయితో సహజీవనం చేశాడా?
  • నిజాన్ని ఎందుకు దాస్తున్నాడో ఈ మాజీ క్రికెటర్‌ చెప్పాలని డిమాండ్‌

‘ఏడేళ్లుగా తాను, భువనేశ్వరి ప్రేమించుకుంటున్నామని, చివరికి పెళ్లితో ఒక్కటయ్యామని' క్రికెటర్‌ శ్రీశాంత్‌ చెప్పడంపై మండిపడుతోంది పంజాబీ ముద్దుగుమ్మ నికీషాపటేల్‌. ‘ఏడేళ్లుగా వేరే అమ్మాయిని ప్రేమిస్తున్న శ్రీశాంత్‌ ఈ కాలంలోనే తనతో ఏడాదిపాటు సహజీవనం చేసిన విషయం మర్చిపోయాడా? లేక దాచిపెడుతున్నాడా? అని ప్రశ్నించింది.

మలయాళం, హిందీ చిత్రాల్లో నటిస్తున్న నికీషా పటేల్‌పై చాలా వదంతులు ఉండగా అందులో శ్రీశాంత్‌తో ఎఫైర్‌ ఒకటి. భారత క్రికెట్‌ జట్టులో సభ్యుడిగా పలు వివాదాల్లో చిక్కుకున్న శ్రీశాంత్‌ జట్టులో స్థానం కోల్పోయిన తర్వాత నటుడి అవతారం ఎత్తాడు. ఆ సమయంలో శ్రీశాంత్‌, నికీషాపటేల్‌ మధ్య సంబంధాలపై మీడియాలో జోరుగా వార్తలు సాగాయి. వీరద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నారని, సహజీవనం చేస్తున్నారన్న వార్తలు హోరెత్తాయి.

అయితే, అప్పట్లో ఇద్దరూ ఈ వార్తలపై నోరు విప్పలేదు. కొంతకాలం క్రితం భువనేశ్వరిని శ్రీశాంత్‌ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయిన చాలా కాలం తర్వాత ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో శ్రీశాంత్‌ మాట్లాడుతూ భువనేశ్వరి, తాను ఏడేళ్లుగా ప్రేమలో మునిగి తేలినట్లు వెల్లడించాడు. ఈ మాటలపైనే నికీషా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ‘శ్రీశాంత్‌తో బ్రేకప్‌ తర్వాత నా కెరీర్‌ ప్రశాంతంగా, సాఫీగా సాగిపోతోంది. కానీ అతను అబద్ధం చెప్పడం మాత్రం సహించలేకపోతున్నాను’ అని మండిపడుతోంది.

cricketer srisanth
Nikisha patel
fire on affaire
  • Error fetching data: Network response was not ok

More Telugu News