Andhra Pradesh: వైసీపీ ఉరవకొండ ఎమ్మెల్యేకు అస్వస్థత.. హుటాహుటిన హైదరాబాద్ కు తరలింపు!

  • ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డికి అనారోగ్యం
  • గుండె వ్యాధితో బాధపడుతున్న నేత
  • ఆరోగ్య పరిస్థితిపై ఇంకా రాని స్పష్టత

వైసీపీ నేత, ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఈ రోజు అస్వస్థతకు లోనయ్యారు. ఉదయాన్నే ఛాతి పట్టేసినట్లు అనిపించడంతో ఆయన్ను కుటుంబ సభ్యులు హుటాహుటిన అనంతపురంలోని సవేరా ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యేకు ప్రాథమిక చికిత్స ప్రారంభించిన వైద్యులు అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆయనను హైదరాబాద్ కు తరలించారు. గత కొంతకాలంగా విశ్వేశ్వరరెడ్డి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.  

Andhra Pradesh
Anantapur District
uravakonda
mla
YSRCP
visweswara reddy
heart disease
Hyderabad
hospital
  • Loading...

More Telugu News