Rakul Preeth: పబ్లిసిటీ కోసం ‘మీటూ’ని వాడుకోవద్దు: రకుల్

  • మహిళలతో తప్పుగా ప్రవర్తించడం సరికాదు
  • లైంగిక వేధింపుల విషయంలో అదృష్టవంతురాలిని
  • నేనెప్పుడూ అలాంటి వేధింపులకు గురికాలేదు

గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా ‘మీటూ’ ఉద్యమానికి సంబంధించిన వార్తలే కనపడుతున్నాయి. గతంలో వివిధ సందర్భాలలో తాము ఎదుర్కున్న వేధింపులను పలువురు వెల్లడిస్తున్నారు. వీరికి పలు వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. ఈ  క్రమంలో టాలీవుడ్ భామ రకుల్ ప్రీత్ కూడా స్పందించింది. లైంగిక పరమైన వేధింపులు.. మహిళలతో తప్పుగా ప్రవర్తించడం వంటివి సరికాదని అభిప్రాయపడింది.

అయితే, పబ్లిసిటీ కోసం మాత్రం ‘మీటూ’ని వాడుకోవద్దని కోరారు. ఈ ఉద్యమం భారత్‌లో రావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన రకుల్.. లైంగిక వేధింపుల విషయంలో తాను అదృష్టవంతురాలినని పేర్కొన్నారు. తానెప్పుడూ ఇలాంటి వేధింపులకు గురికాలేదని ఆమె వెల్లడించారు. బాధితులంతా బయటకు రావడం పట్ల రకుల్ ఆనందం వ్యక్తం చేసింది.

Rakul Preeth
Mee too
Cine Industry
Interview
India
  • Loading...

More Telugu News