indrania mukherjea: నా మరణానికి సీబీఐ బాధ్యత తీసుకుంటుందా?: సీబీఐ కోర్టులో వాదించిన ఇంద్రాణి ముఖర్జియా

  • ఇంద్రాణి బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిన సీీబీఐ ప్రత్యేక కోర్టు
  • అనారోగ్యంతో ఉన్న తనకు బెయిల్ చాలా అవసరం అన్న ఇంద్రాణి
  • ఇంద్రాణి మంచి చెడ్డలు చూసుకోవడానికి ఎవరూ లేరన్న కోర్టు

కన్నకూతురు షీనా బోరాను హత్య చేసిన ఆరోపణలతో జైలు జీవితాన్ని గడుపుతున్న ఇంద్రాణి ముఖర్జియా ముంబైలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో తన ఆవేదనను గట్టిగా వినిపించింది. అనారోగ్యంగో బాధపడుతున్న తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఆమె సీబీఐ కోర్టుకు దరఖాస్తు చేసుకుంది. ఈ బెయిల్ పిటిషన్ ను ఈరోజు కోర్టు విచారించింది. అనంతరం పిటిషన్ ను కొట్టివేసింది. ఈ సందర్భంగా ఆమె వాదిస్తూ, 'అనారోగ్యంతో ఉన్న నాకు బెయిల్ చాలా అవసరం. నేను చనిపోతే దానికి సీబీఐ బాధ్యత తీసుకుంటుందా?' అని ప్రశ్నించింది.

ఇంద్రాణి ముఖర్జియా ప్రస్తుతం ముంబైలోని భైకుల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా వుంది. 2015లో ఆమెను అరెస్ట్ చేశారు. గతంలో కూడా ఆమె బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. ఆమె మంచి చెడ్డలు చూడటానికి కుటుంబసభ్యులు ఎవరూ లేరని కోర్టు తెలిపింది. ఏ క్షణంలో అయినా ఆమె బ్రెయిన్ స్ట్రోక్ కు గురికావచ్చని పేర్కొంది. ఈ సందర్భంగా ఇంద్రాణి వాదిస్తూ, తనకు బెయిల్ వచ్చిన వెంటనే స్పెషలిస్టుల చేత వైద్యం చేయించుకుంటానని తెలిపింది. అయినప్పటికీ ఆమె విన్నపాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు.

indrania mukherjea
sheena bora
bail
cbi
court
  • Loading...

More Telugu News