vijay: అత్యధిక లొకేషన్స్ లో 'సర్కార్' రిలీజ్

  • విజయ్ సరసన కీర్తి సురేశ్
  • ఈ నెల 19వ తేదీన టీజర్ రిలీజ్ 
  • వచ్చే నెల 6వ తేదీన సినిమా విడుదల  

మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా 'సర్కార్' చిత్రం రూపొందింది. కీర్తి సురేశ్ కథానాయికగా నటించిన ఈ సినిమా నుంచి ఈ నెల 19వ తేదీన టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ టీజర్ తోనే సినిమాపై ఒక రేంజ్ లో అంచనాలు పెరిగేలా చూస్తున్నారట. దసరాకి టీజర్ వదిలే ఈ సినిమా టీమ్ .. దీపావళి సందర్భాన్ని పురస్కరించుకుని నవంబర్ 6వ తేదీన సినిమాను విడుదల చేయనున్నారు.

తమిళంతో పాటు తెలుగులోను అదే రోజున ఈ సినిమాను అత్యధిక థియేటర్స్ లో విడుదల చేయనున్నారు. ఒక్క యూఎస్ లోనే 150 లొకేషన్స్ లో ఈ సినిమాను విడుదల చేయనుండటం విశేషం. ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, వరలక్ష్మి శరత్ కుమార్ .. కమెడియన్ యోగిబాబు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.  

  • Loading...

More Telugu News