rampal baba: హత్య కేసులో రాంపాల్ బాబాకు శిక్ష ఖరారు.. జీవితఖైదు విధించిన న్యాయస్థానం

  • హరియాణాలోని హిస్సార్ స్థానిక కోర్టు తీర్పు 
  • మరో హత్య కేసులో శిక్ష రేపు ఖరారు  
  • 2014లో రాంపాల్ బాబాపై రెండు కేసుల నమోదు

స్వయం ప్రకటిత దేవుడిగా చలామణి అవుతున్న వివాదాస్పద గురువు రాంపాల్ బాబాకు ఓ హత్య కేసులో జీవితఖైదు విధిస్తున్నట్టు హరియాణాలోని హిస్సార్ స్థానిక న్యాయస్థానం తీర్పు వెలువరించింది. రెండు హత్య కేసుల్లో రాంపాల్ బాబాతో పాటు ఆయన అనుచరులు 27 మందిని దోషులుగా తేలుస్తూ ఈ నెల 11న కోర్టు తీర్పు నిచ్చింది. ఇందులో ఒక కేసుకు సంబంధించిన తీర్పును న్యాయస్థానం ఈరోజు వెలువరించింది. రెండో కేసుకు సంబంధించిన శిక్ష రేపు ఖరారు కానుంది.

 కాగా, హర్యానాలోని బర్వాలా గ్రామంలో రాంపాల్ బాబాకు సత్ లోక్ ఆశ్రమం ఉంది. ఆయనకు భారీ సంఖ్యలో భక్తులు, అనుచరులు ఉన్నారు. ఈ క్రమంలో బాబాకు శిష్యురాళ్లుగా ఉన్న తమ భార్యలు హత్యకు గురయ్యారని ఇద్దరు వ్యక్తులు వేర్వేరుగా పోలీసులకు గతంలో ఫిర్యాదు చేశారు. ఢిల్లీలోని బద్రపూర్ సమీపంలోని మిఠాపూర్ కు చెందిన శివపాల్, ఉత్తరప్రదేశ్ లోని లలిత్ పూర్ జిల్లా జఖోరా గ్రామానికి చెందిన సురేశ్ లు ఈ ఫిర్యాదులు చేశారు. దీంతో, 2014 నవంబర్ 19న రాంపాల్ బాబా, ఆయన అనుచరులపై బర్వాలా పోలీస్ స్టేషన్ లో రెండు కేసులు నమోదయ్యాయి.

  • Loading...

More Telugu News