Ramcharan: రామ్ చరణ్ సినిమాలోని ఫొటోలు లీక్!

  • సింహాచలం పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న చరణ్ చిత్రం
  • యాక్షన్ సన్నివేశం ఫొటోలు లీక్
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు

షూటింగ్ సందర్భంగా దర్శకులు, నిర్మాతలు, యూనిట్ సభ్యులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా... ఏదో విధంగా ఔట్ పుట్ లీక్ అవుతూనే ఉంది. దాదాపు అన్ని చిత్రాలకు సంబంధించి ఫొటోలు, వీడియోలు బయటకు వస్తూనే ఉన్నాయి. తాజాగా రామ్ చరణ్ చిత్రంలోని ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై చరణ్ తాజా చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో చరణ్ సరసన కైరా అద్వానీ నటిస్తుండగా, వివేక్ ఒబెరాయ్, ఆర్యన్ రాజేష్, సుదీప్, తమిళ హీరో ప్రశాంత్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్రం సింహాచలం పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్ సన్నివేశాలకు చెందిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఈ సన్నివేశంలో చరణ్ రఫ్ లుక్ లో కనిపిస్తున్నాడు.

Ramcharan
tollywood
film
action scenes
leak
  • Loading...

More Telugu News