Khammam District: అక్కను పెళ్లాడి, చెల్లికి లైనేసిన ప్రబుద్ధుడు... బావ చేష్టలకు విసిగి ఆత్మహత్య!

  • కానిస్టేబుల్ గా పనిచేస్తున్న అశోక్
  • ఇటీవలే సుష్మ అనే యువతితో పెళ్లి
  • సుష్మ సోదరి అనూషను ప్రేమించాలని ఒత్తిడి
  • మనస్తాపంతో అనూష ఆత్మహత్య

అతను శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసు. ఓ అమ్మాయితో ఏడడుగులూ నడిచి, ఆమెకు జీవితాంతం తోడుంటానని వాగ్దానం చేస్తూ, పెళ్లి చేసుకున్నాడు. ఆపై ఆమె చెల్లెలి ముందు ప్రేమ పాఠాలు వల్లించాడు. తనను ప్రేమించాలంటూ వేధించాడు. బావ వేధింపులను భరించలేని ఆ మరదలు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో కలకలం రేపింది.

పోలీసులు, స్థానికుల కథనం మేరకు,  చిన్నగోపతి గ్రామానికి చెందిన లింగాల బిక్షంకు పెద్దకుమార్తె సుష్మ, చిన్న కుమార్తె అనూష ఉన్నారు. సుష్మను, అదే మండలంలోని సింగరాయపాలెం గ్రామానికి చెందిన అశోక్‌ అనే కానిస్టేబుల్ కు ఇచ్చి వివాహం జరిపించాడు. పెళ్లయిన తరవాత అశోక్ కన్ను అనూషపై పడింది. తనను ప్రేమించకుంటే తప్పుడు కేసులు పెట్టి ఇరికిస్తానని బెదిరింపులకు దిగాడు. అత్తమామలు, గ్రామపెద్దలు ఈ విషయంలో అశోక్ ను హెచ్చరించినా, పధ్ధతి మార్చుకోలేదు.

ఈ నేపథ్యంలో అనూష పేరిట అశోక్ ఓ తప్పుడు కోర్టు నోటీసులు తయారు చేయించి పంపాడు. అనూషపై కేసు నమోదైందని, కోర్టుకు హాజరుకాకుంటే అరెస్ట్ తప్పదని దానిలో చూసిన అనూష, తీవ్ర ఆందోళనతో మనస్తాపానికి గురై, ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అల్లుడి వేధింపులు తాళలేక తన చిన్న కుమార్తె ఆత్మహత్య చేసుకుందని లింగాల భిక్షం ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాఫ్తు ప్రారంభించారు.

Khammam District
Police
Sucide
Sister
Sister in law
Love
Harrasment
  • Loading...

More Telugu News