Trains: ఇక విమానాల్లో మాదిరిగా రైళ్లలోనూ బ్లాక్ బాక్సులు!

  • రైళ్లలో లోకో క్యాబ్ వాయిస్ రికార్డింగ్ పరికరాలు
  • ప్రమాదానికి కారణాలను అంచనా వేయొచ్చు
  • అభివృద్ధి దశలోనే ఉందని అధికారుల వెల్లడి

ఇకపై రైలు ప్రమాదాల కారణాల గురించి కచ్చితమైన సమాచారం లభించనుంది. ఇందుకోసం భారతీయ రైళ్లు త్వరలో మరింత అధునాతన సాంకేతికతను సంతరించుకోనున్నాయి. విమానాల్లో మాదిరిగా రైళ్లలోనూ బ్లాక్ బాక్సులు ఏర్పాటు చేయాలనే యోచన చేస్తున్నట్టు సమాచారం.

ఈ మేరకు రైళ్లలో లోకో క్యాబ్ వాయిస్ రికార్డింగ్ పరికరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఏదైనా ప్రమాదం సంభవించినపుడు బ్లాక్ బాక్సుల ద్వారా సిబ్బంది పనితీరును, ప్రమాదానికి గల కారణాలపై ఓ నిర్ణయానికి రావడానికి ఆస్కారం లభిస్తుంది. అయితే ఇంకా ఇది అభివృద్ధి దశలోనే ఉన్నట్టు రైల్వే అధికారులు చెబుతున్నారు. 

Trains
Flights
Black Box
Voice Recording
Indian Railway
  • Loading...

More Telugu News