Anitha: ఉద్యోగం కోసం మోసానికి పాల్పడ్డ ఏపీ ఎమ్మెల్యే అనిత డ్రైవర్

  • యనమల రామకృష్ణుడు పేరుతో సిఫార్స్ లేఖ
  • విషయాన్ని గ్రహించిన విద్యుత్ శాఖా మంత్రి
  • అఖిల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత డ్రైవర్ అఖిల్ ఉద్యోగం కోసం మోసానికి పాల్పడ్డాడు. అసలు విషయం బట్టబయలవడంతో కటకటాలపాలయ్యాడు. విద్యుత్ శాఖలో ఉద్యోగం కోసం ఏకంగా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పేరుతో అఖిల్ సిఫార్స్ లేఖ తయారు చేసుకున్నాడు. విషయాన్ని గ్రహించిన విద్యుత్ శాఖా మంత్రి కళా వెంకట్రావు... సదరు లేఖ విషయాన్ని యనమల దృష్టికి తీసుకెళ్లడంతో అఖిల్ బండారం బయట పడింది. లేఖను అనుమానించిన యనమల కార్యాలయం వెంటనే కళా వెంకట్రావు పేషీకి సమాచారమిచ్చారు. కళా వెంకట్రావు పేషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉద్యోగం కోసం వెళ్లిన అఖిల్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Anitha
Akhil
Yanamala
Kala Venkat Rao
Police
  • Loading...

More Telugu News