mega hero varun tej: ‘తిత్లీ’ బాధితులకు సాయం ప్రకటించిన ‘మెగా’ హీరో వరుణ్ తేజ్

  • ప్రజల కోసం మనం నిలబడాల్సిన సమయమిది
  • నా వంతు సాయం చేశా.. ఇక మీ వంతు: వరుణ్ తేజ్
  • రూ.5 లక్షలు విరాళంగా ఇచ్చిన మెగా హీరో

తిత్లీ తుపాను కారణంగా నష్టపోయిన రైతులు, ప్రజలకు నష్టపరిహారం అందజేయాలని ఏపీ ప్రభుత్వ ప్రకటనతో ఇప్పటికే సినీ ప్రముఖులు పలువురు ముందుకొచ్చారు. తాజాగా, ‘మెగా’ ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ తన వంతు సాయం అందించాడు. సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.5 లక్షలు విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించాడు.

మన ప్రజల కోసం మనం నిలబడాల్సిన సమయమిదని, తన వంతు సాయం చేశానని, ఆంధ్రాలోని ఇళ్లను పునర్నిర్మించుకోవడానికి కావాల్సిన ఆర్థిక సాయం చేయాలని ప్రతిఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నానని తన ట్వీట్ లో కోరాడు. ఇదిలా ఉండగా, దర్శకుడు అనిల్ రావిపూడి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కు లక్ష రూపాయలు విరాళంగా ప్రకటించారు.

mega hero varun tej
5 lakhs
cm relief fund
  • Loading...

More Telugu News