amala paul: అమలాపాల్ కు సమస్య వచ్చినప్పుడు వెంటనే స్పందించాం: విశాల్

  • మహిళల భద్రత కోసం కమిటీని ఏర్పాటు చేస్తున్నాం
  • ఎవరికి ఏ సమస్య వచ్చినా... వెంటనే మా దృష్టికి తీసుకురావాలి
  • 'సండకోళి-2' సినిమాలో వరలక్ష్మి అద్భుతంగా నటించింది

సినీ పరిశ్రమలో మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నామని నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి, హీరో విశాల్ తెలిపాడు. మీటూ ఉద్యమానికి తమిళ హీరోలు ఎందుకు మద్దతు పలకలేదనే ప్రశ్నకు బదులుగా... ఎవరికైనా ఏదైనా అన్యాయం జరిగినా, ఇబ్బందులు ఎదుర్కొన్నా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని... తక్షణమే వాటిని పరిష్కరించి, తగిన న్యాయం చేస్తామని చెప్పాడు.

హీరోయిన్ అమలాపాల్ కు గతంలో ఓ సమస్య తలెత్తినప్పుడు ఆమె వెంటనే దాన్ని తమ దృష్టికి తీసుకొచ్చిందని... సంబంధిత వ్యక్తిని తాము వెంటనే అరెస్ట్ చేయించి, సమస్యను పరిష్కరించామని తెలిపాడు. 'సండకోళి-2' సినిమా ప్రమోషన్ లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ, విశాల్ పైవ్యాఖ్యలు చేశాడు.

'సండకోళి-2' సినిమాలో వరలక్ష్మి అద్భుతంగా నటించిందని... సినిమా చూశాక అందరూ ఆమె గురించే మాట్లాడుకుంటారని విశాల్ తెలిపాడు. క్లైమాక్స్ లో వరూ నటన అందరినీ మెప్పిస్తుందని చెప్పాడు. ఈ చిత్రంలో విశాల్, కీర్తి సురేష్, వరలక్ష్మి, రాజ్ కిరణ్ తదితరులు నటించారు. 

amala paul
vishal
varalakshmi
kollywood
  • Loading...

More Telugu News