uddanam: వానంటే వణుకుతున్న ఉద్ధానం వాసులు.. రెండు రోజుల వర్షాల వార్తలతో ఆందోళన

  • తిత్లీ దెబ్బకు కకావికలమైన నివాసితులు
  • ఎక్కడ తలదాచుకోవాలో తెలియని స్థితిలో ఉన్నామని ఆవేదన
  • ఈ పరిస్థితుల్లో వర్షం కురిస్తే నరకమేనని బెంగ

తిత్లీ తుపాను బీభత్సం భయం ఉద్ధానం వాసులను వెంటాడుతోంది. భయంకరమైన వాన, గాలులతో కొంపగూడు కోల్పోయి కకావికలమైన నివాసితులు ఇప్పుడు వర్షం కురుస్తుందంటే తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇల్లు కూలిపోయి నిరాశ్రయులైన చాలా మంది ఎక్కడెక్కడో తలదాచుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో మరో రెండు రోజు వర్షాలు కురుస్తాయని ఆదివారం వాతావరణ శాఖ ప్రకటించడంతో బిక్కుబిక్కుమంటున్నారు.

ఇప్పటికే చాలా కుటుంబాలు కట్టుబట్టలతో చెట్ల కింద నివాసం ఉంటున్నాయి. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఇచ్చిన దానితో కడుపు నింపుకొని నెట్టుకు వస్తున్నారు. జీడి, కొబ్బరి తోటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. తిత్లీ విధ్వంసం ఇంకా కళ్ల ముందు మెదులుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో మళ్లీ వర్షాలు కురిస్తే ఏం చేయాలో పాలు పోవడం లేదని బాధితులు వాపోతున్నారు.

  • Loading...

More Telugu News