Manohar Parrikar: ఎయిమ్స్ నుంచి గోవా సీఎం డిశ్చార్జ్.. ప్రత్యేక విమానంలో గోవాకు పారికర్

  • గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సీఎం
  • ఆదివారం ఉదయం ఐసీయూలో ఉన్నట్టు ప్రకటన
  • మధ్యాహ్నానికి డిశ్చార్జ్

అనారోగ్యంతో గత కొంతకాలంగా ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆదివారం డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం ప్రత్యేక విమానంలో గోవాకు వచ్చారు. అక్కడి నుంచి ఆయనను నేరుగా ఇంటికి తీసుకెళ్లారు. పారికర్ ఆరోగ్యం కుదుటపడిందని, ఆయనకు ఇంకొంతకాలం విశ్రాంతి అవసరమని కేంద్రమంత్రి శ్రీపాద నాయక్ అన్నారు. ఆదివారం ఉదయం పారికర్‌ను ఐసీయూలో ఉంచినట్టు చెప్పిన ఎయిమ్స్ వర్గాలు, మధ్యాహ్నానికి ఆయనను డిశ్చార్జ్ చేయడం గమనార్హం. కాగా, ఇంటికి చేరుకున్న ముఖ్యమంత్రిని పలువురు నేతలు పరామర్శించారు.

Manohar Parrikar
Goa
New Delhi
AIIMS
BJP
  • Loading...

More Telugu News