SBI: ఎస్‌బీఐ కూడా ప్రకటించేసింది.. డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు!

  • యోనో యాప్‌లో పండుగల ఆఫర్లు
  • 85 శాతం ఈ-కామర్స్ సంస్థలతో ఒప్పందం
  • 16-21 మధ్య కొనుగోళ్లపై ఆఫర్లు

దసరా, దీపావళిని పురస్కరించుకుని భారతీయ స్టేట్‌బ్యాంక్ (ఎస్‌బీఐ) భారీ ఆఫర్లతో ముందుకొచ్చింది. ఆ సంస్థ తీసుకొచ్చిన యోనో యాప్ ద్వారా ఈ పండుగ సీజన్‌లో కొనుగోళ్లు జరిపే వారికి భారీ రాయితీలు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ఇవ్వనున్నట్టు తెలిపింది. డిజిటల్ షాపింగ్ వేదికను అందిస్తున్న ఏకైక బ్యాంకు తమదేనని పేర్కొన్న ఎస్‌బీఐ ఈ నెల 16 నుంచి 21 మధ్య ‘యోనో’ ద్వారా జరిపే కొనుగోళ్లపై పది శాతం రాయితీ, క్యాష్‌బ్యాక్ ఇవ్వనున్నట్టు తెలిపింది.

దాదాపు 85 శాతం ఈ-కామర్స్ సంస్థలు యోనోతో ఒప్పందం కుదుర్చుకున్నాయని, అమెజాన్‌, జబాంగ్‌, మింత్రా, క్యారట్‌లేన్‌, పెప్పర్ ఫ్రై, ఓయో, యాత్ర, ఈజ్‌మైట్రిప్‌, ఫస్ట్‌క్రై,  ఫెర్న్స్‌ అండ్‌ పెటల్స్‌ వంటి సంస్థలు ఇందులో ఉన్నాయని వివరించింది. ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, గిఫ్ట్, నగలు, ట్రావెల్, ఫర్నిచర్, హాస్పిటాలిటీ రంగంలో పలు ఆఫర్లు ఉన్నట్టు ఎస్‌బీఐ పేర్కొంది.

SBI
YONO
Festival Offers
Dasara
Diwali
E-commerce
  • Loading...

More Telugu News