Married Woman: అత్యాచార యత్నం చేస్తుంటే ప్రతిఘటించిందని.. యాసిడ్ దాడి!

  • పోలీసులకు ఫిర్యాదు చేసిన వివాహిత
  • ప్రభుత్వాసుపత్రికి తరలించిన పోలీసులు
  • మహేష్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

అత్యాచార యత్నం చేస్తుంటే ప్రతిఘటించిందని ఓ వివాహిత (26)పై కక్ష పెంచుకున్న ఓ వ్యక్తి ఆమెపై యాసిడ్ దాడి చేశాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం దామర గ్రామానికి చెందిన ఓ వివాహిత(26)పై అదే గ్రామానికి చెందిన బి.మహేష్ శనివారం రాత్రి అత్యాచార యత్నానికి పాల్పడగా ఆమె ప్రతిఘటించింది. దీంతో మహేష్ ఆ వివాహితపై యాసిడ్‌తో దాడి చేశాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలిని దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గతంలో కూడా మహేష్ ఆమెపై వేధింపులకు పాల్పడినట్టు తెలుస్తోంది. మహేష్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేసిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Married Woman
Mahesh
Police
Nalgonda District
Devarakonda
  • Loading...

More Telugu News