vaira muttu: 'లై డిటెక్టర్' పరీక్ష నిర్వహించాలన్న కామెంట్ పై స్పందించిన చిన్మయి శ్రీపాద!

  • వైరముత్తుకు లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించాలంటూ ట్వీట్
  • ఈ ట్వీట్ పై స్పందించిన నెటిజన్ కామెంట్స్
  • ఆ కామెంట్స్ కు దీటుగా బదులిచ్చిన చిన్మయి

లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళ సినీ రచయిత వైరముత్తుకు లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించాలని అభిప్రాయపడుతూ సింగర్ చిన్మయి శ్రీపాద తన ట్వీట్ లో పేర్కొంది. అయితే, ఈ ట్వీట్ పై స్పందించిన ఓ నెటిజన్, వైరముత్తు కంటే ముందుగా చిన్మయి శ్రీపాదకు నిర్వహించాలని కామెంట్ చేశారు.

ఈ నెటిజన్ వ్యాఖ్యలపై స్పందించిన చిన్మయి ఘాటుగా రిప్లై ఇచ్చింది. ‘కచ్చితంగా, నాకు ఆ ధైర్యం ఉంది, అతడికి ఉందా?’ అని ప్రశ్నించింది. తనకు ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పుడే వైరముత్తు తనపై లైంగిక దాడి చేశారని, ఓసారి స్విట్జర్లాండ్ పర్యటనకు వెళ్లినప్పుడు తనను ఆయన హోటల్ గదికి రమ్మన్నారని చిన్మయి ఇటీవల ఆరోపణలు చేసింది.

vaira muttu
chinmaya sripada
  • Loading...

More Telugu News