Hyderabad: మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ భవంతిపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య!

  • హైదరాబాద్ శివార్లలో ఘటన
  • శనివారం నాడు సంధ్య ఆత్మహత్యాయత్నం
  • చికిత్స పొందుతూ ఈ ఉదయం మృతి

హైదరాబాద్ నగర శివార్లలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్న సంధ్య అనే విద్యార్థిని కళాశాల భవంతి నాలుగో అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య యత్నం చేయడం తీవ్ర కలకలం రేపింది. శనివారం నాడు ఆమె ఆత్మహత్యాయత్నం చేయగా, ఇతర విద్యార్థినులు, కళాశాల యాజమాన్యం ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, ఈ ఉదయం సంధ్య మరణించింది. తలకు, నడుముకు తగిలిన తీవ్ర గాయాల కారణంగా ఆమె మరణించినట్టు వైద్య వర్గాలు వెల్లడించాయి. కాగా, తమ బిడ్డ మృతికి మల్లారెడ్డి కాలేజీ యాజమాన్యమే కారణమని సంధ్య తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తూ, నిరసనకు దిగారు.

Hyderabad
Sandhya
Mallareddy College
Sucide
  • Loading...

More Telugu News