sister: చెల్లి పుట్టినరోజు సందర్భంగా.. కేన్సర్ తో ఆమె పోరాటం గురించి వెల్లడించిన నవాజుద్దీన్ సిద్ధిఖీ!

  • 18 ఏళ్లుగా రొమ్ము కేన్సర్ ‌తో బాధపడుతోంది
  • ధైర్యం, ఆత్మవిశ్వాసంతో పోరాడింది
  • ప్రేరణ కల్పించిన వైద్యులకు ధన్యవాదాలు

తన చెల్లి 25వ పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ భయంకరమైన నిజాన్ని వెల్లడించారు. తన చెల్లి రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతోందంటూ నవాజుద్దీన్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ‘నా సోదరి 18 ఏళ్ల వయసులో రొమ్ము క్యాన్సర్‌ అడ్వాన్స్‌ స్టేజ్‌తో బాధపడింది. కానీ ఆమె తన ధైర్యం, ఆత్మ విశ్వాసంతో వ్యాధిని జయించేందుకు పోరాటం చేసింది. ఇవాళ తను 25వ పుట్టినరోజు జరుపుకుంటోంది. ఇప్పటికీ క్యాన్సర్‌తో పోరాడుతోంది. ఆమెకు ప్రేరణ కల్పించిన వైద్యులకు ధన్యవాదాలు. నేను సరైన వైద్యుల్ని కలవడానికి కారణమైన పూకుట్టి సర్‌కు కృతజ్ఞతలు’ అని నవాజ్‌ పోస్ట్‌ చేశారు. నవాజుద్దీన్‌ సోదరి కోలుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.

sister
Cancer
25th Birthday
Navazuddin siddiqui
  • Loading...

More Telugu News