Kangana Ranaut: కంగనాను ప్రశ్నించిన దర్శకుడు వికాస్ మాజీ భార్య!

  • డిన్నర్‌కు, వినోద కార్యక్రమాలకు వెళ్తారా?
  • కంగనా వ్యక్తిత్వంలోనే లోపాలు
  • ప్రతిభ ఉన్న వ్యక్తి కాబట్టి కలిసి పనిచేస్తారా?

కంగనా ఆరోపణలు చేసిన బాలీవుడ్ దర్శకుడు వికాస్ బహల్‌కు ఆయన మాజీ భార్య రిచా డుబే మద్దతుగా నిలిచారు. వికాస్‌ బహల్‌ ‘క్వీన్‌’ సినిమా సెట్‌లో తనతో అసభ్యంగా ప్రవర్తించారని నటి కంగనా రనౌత్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను రిచా ఖండించారు. కంగనా రనౌత్‌ వ్యక్తిత్వంలో లోపాలు ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ మేరకు రిచా సోషల్ మీడియా ద్వారా ఓ పోస్ట్ పెట్టారు.

‘‘ఇది హద్దులు దాటి పోతోంది. ఇది ‘మీటూ’ కాదు. ఓ పురుషుడు అసౌకర్యానికి గురి చేస్తే, అసభ్యంగా ముట్టుకుంటే ఆయనతో ఏ మహిళ అయినా మంచి స్నేహాన్ని కొనసాగిస్తుందా? అని నేను ప్రతి మహిళను అడుగుతున్నా. ఆయనతో మాట్లాడటం తగ్గించరా?.. ఆయనతోనే కలిసి డిన్నర్‌కు, వినోద కార్యక్రమాలకు వెళ్తారా?.. ఆయన ప్రతిభ ఉన్న వ్యక్తి కాబట్టి కలిసి పనిచేయాలని చూస్తారా?’’ అని రిచా అన్నారు.

ఈ వ్యాఖ్యలపై స్పందించిన కంగనా.. మాజీ భర్తకు సాయం చేసేందుకు మాజీ భార్య ముందుకు వచ్చారని అన్నారు. మరి వికాస్‌ అంత మంచి వ్యక్తి అయితే ఆయనకు ఎందుకు విడాకులు ఇచ్చారని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా రిచా.. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నామని, ఇప్పటికీ తమది ఒకే కుటుంబమని, చెత్తగా మాట్లాడొద్దని హితవు పలికారు.

Kangana Ranaut
Vikas Bahl
Richa Dube
Mee Too
  • Loading...

More Telugu News