: పాక్ లో నవాజ్ షరీఫ్ పార్టీ జయభేరి
పాకిస్తాన్ ఎన్నికల్లో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పార్టీ పీఎంఎల్-ఎన్ ఘన విజయం సాధించింది. పార్లమెంటు దిగువసభకు జరిగిన ఈ ఎన్నికల్లో మొత్తం 272 స్థానాలకు గాను పీఎంఎల్-ఎన్ 126 స్థానాలు గెలిచి స్పష్టమైన ఆధిక్యం నమోదు చేసింది. మరికొన్ని స్థానాల్లోనూ నవాజ్ షరీఫ్ పార్టీయే ముందంజలో ఉంది. ఇప్పటివరకు 262 స్థానాల్లో ఫలితాలు వెలువడగా, మాజీ క్రికెటర్ ఇమ్రాన ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ పార్టీ 34 స్థానాల్లో జయభేరి మోగించింది. కాగా, అధికార పీపీపీ కేవలం 32 స్థానాలే దక్కించుకుని కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా పొందలేకపోయింది. ఇక ఇతరులు 71 స్థానాలు కైవసం చేసుకున్నారు. పాక్ లో నిన్న పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే.