revanth reddy: డీజీపీపై నమ్మకం లేదు.. సెంట్రల్ సెక్యూరిటీ ద్వారా రక్షణ కల్పించండి: రేవంత్ రెడ్డి

  • టీఆర్ఎస్ పార్టీ శిక్షణ కార్యక్రమంలో డీజీపీ పాల్గొన్నారు
  • నన్ను అంతమొందిస్తామని టీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు
  • కేసీఆర్ గురించి నాయిని చేసిన వ్యాఖ్యలను సుమోటాగా తీసుకోవాలి

తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిపై తనకు నమ్మకం లేదని... అందుకే తనకు రాష్ట్ర పోలీసులతో కాకుండా కేంద్ర సెక్యూరిటీ సంస్థల ద్వారా రక్షణ కల్పించాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్టు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తెలిపారు. నాగార్జునసాగర్ లో గతంలో జరిగిన టీఆర్ఎస్ పార్టీ శిక్షణలో ఆయన పాల్గొన్నారని... అందుకే ఆయనపై నమ్మకం లేదని చెప్పారు. తనను భౌతికంగా అంతమొందిస్తామని టీఆర్ఎస్ నేతలు జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, బాల్క సుమన్ లు హెచ్చరించారనే విషయాన్ని గుర్తు చేశారు.

ఎల్బీనగర్ నుంచి పోటీ చేస్తే రూ. 10 కోట్లు ఇస్తానని కేసీఆర్ చెప్పారంటూ నాయిని నరసింహారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఈసీ దృష్టికి తీసుకెళ్లానని రేవంత్ తెలిపారు. దీన్ని సుమోటాగా తీసుకోవాలని లేదా తన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయాలని కోరానని చెప్పారు.

revanth reddy
dgp
secutiry
kct
nayini
TRS
congress
  • Loading...

More Telugu News