Rajashekhar: 'వెంకట్రావ్ కోట'లో షూటింగుకి వచ్చిన హీరో రాజశేఖర్ కుటుంబ సభ్యులు!

  • సూర్యాపేట సమీపంలోని నడిగూడెంలో షూటింగ్
  • దొరల కుటుంబ నేపథ్యంలో కథ
  • కోట పటిష్ఠతపై స్థానికులతో రాజశేఖర్ ఆరా

కొత్త హీరో హీరోయిన్లతో రాజశేఖర్ దంపతులు తలపెట్టిన సినిమా షూటింగ్ సూర్యాపేట సమీపంలోని నడిగూడెంలోని జమిందారు రాజానాయిని వెంకట్రావ్ కోటలో జరుగుతుండగా, షూటింగ్ కు కోట ఎంతవరకు సురక్షితమన్న విషయాన్ని ఆయన దగ్గరుండి పరిశీలించారు,. ఇక్కడి సాయి ఆలయంలో సినిమా ముహూర్తపు షాట్ తీసిన తరువాత, కోటలోని అన్ని గదులను, పరిసరాలను రాజశేఖర్ పరిశీలించారు.

దొరల కుటుంబ నేపథ్యంలో ఈ సినిమా కథ ఉంటుందని తెలుస్తుండగా, కోట పటిష్ఠతపై స్థానికులతో రాజశేఖర్ మాట్లాడారు. తమ అభిమాన నటుడు వచ్చాడని తెలుసుకున్న ఫ్యాన్స్, రాజశేఖర్ దంపతులను చూసేందుకు, వారితో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు. రాజశేఖర్, జీవితలతో పాటు వారి ఇద్దరు కుమార్తెలు కూడా నడిగూడెం రావడంతో గ్రామంలో సినిమా సందడి నెలకొంది. కోటలోకి ఇతరులు ఎవరూ ప్రవేశించకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.

Rajashekhar
Jeevita
Nadiguden
Fort
Shooting
  • Loading...

More Telugu News