Nagam janardhan reddy: నాగం జనార్దన్‌రెడ్డి ఇంట్లో విషాదం.. అనారోగ్యంతో కుమారుడు దినకర్‌రెడ్డి కన్నుమూత!

  • వారం రోజుల క్రితమే ఆసుపత్రిలో చేరిక
  • ఊపిరితిత్తుల మార్పిడికి ఏర్పాట్లు చేస్తుండగానే మృతి
  • నాగంను పరామర్శించిన వివిధ  పార్టీల నేతలు

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి కుమారుడు దినకర్ రెడ్డి (46) మృతి చెందారు. గత కొంతకాలంగా శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. నాగంకు ఇద్దరు కుమారులు కాగా, పెద్ద కుమారుడైన దినకర్ రెడ్డి వైద్య వృత్తిలోనే ఉన్నారు. మరోవైపు, సివిల్ కాంట్రాక్టులు కూడా చేస్తున్నారు.

తీవ్ర అనారోగ్యంతో గత వారం ఆయన ఆసుపత్రిలో చేరారు. ఊపిరితిత్తుల మార్పిడి కోసం వైద్యులు ఏర్పాటు చేస్తుండగానే, గురువారం రాత్రి పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. కుమారుడి మృతితో నాగం కుటుంబం విషాదంలో మునిగిపోయింది. నాగం కుమారుడి మృతి విషయం తెలిసిన కాంగ్రెస్ నేతలు, టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం తదితరులు ఆసుపత్రికి చేరుకుని నాగంను పరామర్శించారు.

Nagam janardhan reddy
Dinakar Reddy
Appolo Hospital
Congress
Hyderabad
  • Loading...

More Telugu News