mali tribe: ఇకపై పదేళ్లు దాటిన బాలికలు జీన్స్ ధరించడానికి వీల్లేదు.. 'మాలి' తెగ పెద్దల నిర్ణయం
- ఈ ఏడాది కూడా గర్భా నృత్య వేడుక నిర్వహిస్తాం
- ఇందులో భాగంగానే డ్రెస్ కోడ్ విధించాం
- మాలి వర్గ మహిళా ప్రెసిడెంట్ మంజులా మాలి
మధ్యప్రదేశ్ లోని మాలి తెగకు చెందిన పెద్దలు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ తెగలో పదేళ్ల దాటిన మాలికలు ఇకపై జీన్స్ ధరించడాన్ని నిషేధించారు. ఈ నిషేధాన్ని దేవీ నవరాత్రుల నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా అలీరాజ్ పూర్ లోని మాలి వర్గ మహిళా ప్రెసిడెంట్ మంజులా మాలి మాట్లాడుతూ, ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా గర్భా నృత్య వేడుక నిర్వహించాలని నిర్ణయించామని, ఇందులో భాగంగానే డ్రెస్ కోడ్ విధించామని చెప్పారు. ఆడపిల్లలు వారి ఇళ్లల్లో కూడా జీన్స్ ధరించడం నిషేధమేనని, ఇకపై ఏ పండగలకూ వారు వీటిని ధరించేందుకు వీల్లేదని, ఇదే నిబంధన కొనసాగుతుందని స్పష్టం చేశారు.