raghav bahal: ప్రముఖ మీడియా సంస్థ అధినేత నివాసం, కార్యాలయాలపై ఐటీ దాడులు

  • రాఘవ్ బహల్ నివాసం, కార్యాలయాల్లో సోదాలు
  • నెట్ వర్క్ 18, క్వింట్ న్యూస్ పోర్టల్ వ్యవస్థాపకుడు రాఘవ్
  • పన్ను ఎగవేత కారణాలతో ఐటీ దాడులు

మీడియా బ్యారన్, నెట్ వర్క్ 18 గ్రూప్, క్వింట్ న్యూస్ పోర్టల్ వ్యవస్థాపకుడు రాఘవ్ బహల్ పై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. పీటీఐ కథనం ప్రకారం ఢిల్లీ సమీపంలోని నోయిడా ప్రాంతంలో ఉన్న ఆయన నివాసం, కార్యాలయాలపై దాడులు జరిగాయి. పన్ను ఎగవేశారన్న కారణాలతో ఈ దాడులను నిర్వహించారు. కీలకమైన డాక్యుమెంట్లు, ఆధారాల కోసం అధికారులు సోదాలు జరుపుతున్నారు. రాఘవ్ తో పాటు మరికొందరు వ్యాపారవేత్తల నివాసాల్లో కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి.  

raghav bahal
network 18
quint
it
taids
delhi
  • Loading...

More Telugu News