governor: మంగళగిరి పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌కు నేడు గవర్నర్‌ నరసింహన్‌

  • ప్రత్యేక విమానంలో విజయవాడ రాక
  • ఇంద్రకీలాద్రిపై జరిగే దసరా ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం
  • సాయంత్రం 3 గంటలకు తిరుగు ప్రయాణం

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇ.ఎస్‌.ఎల్‌.నరసింహన్‌ మంగళగిరిలోని పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌ను నేడు సందర్శించనున్నారు. ఉదయం 10.40 గంటలకు ఆయన క్వార్టర్స్‌కు చేరుకోనున్నారు. ఉదయం ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో విజయవాడలోని గేట్‌ వే హోటల్‌కు వెళ్తారు.

అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌కు బయలుదేరి వెళ్తారు. మధ్యాహ్నం 1.20 గంటల వరకు అక్కడే ఉంటారు. పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌ నుంచి గేట్‌ వే హోటల్‌కు తిరుగు ప్రయాణం అవుతారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక విమానంలో తిరిగి హైదరాబాద్‌కు బయుదేరి వెళ్తారు. ప్రస్తుతం ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దసరా మహోత్సవాలు జరుగుతున్న సమయం కాబట్టి, వీలు చూసుకుని ఆయన దుర్గమ్మను దర్శించుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

governor
Vijayawada
police headquarters
  • Loading...

More Telugu News