Snake: ఎటెళ్లాలో తెలియక ఇంట్లోకి వచ్చేసిన ఆరడుగుల నాగుపాము... కొట్టి చంపిన ప్రజలు!
- గండికోట జలాశయంలో 12 టీఎంసీలకు నీటినిల్వ
- బయటకు వస్తున్న విషసర్పాలు
- ఆందోళన చెందుతున్న ప్రజలు
కడప జిల్లా గండికోట ప్రాంతంలో ప్రజలు విషసర్పాల భయంతో ఆందోళన చెందుతున్నారు. జలాశయంలో 12 టీఎంసీల మేరకు నీటి నిల్వ చేరుకోవడంతో పక్కనే ఉన్న కొండాపురంలోకి పాములు, తేళ్లు వంటివి వస్తున్నాయి. ఇక్కడి రామచంద్ర నగర్ కాలనీలోని పాణ్యం బెనర్జీ అనే వ్యక్తి ఇంట్లోకి దాదాపు ఆరు అడుగుల పొడవున్న నాగుపాము వచ్చింది.
జలాశయంలో నీరు లేనప్పుడు ఆ ప్రాంతంలో సంచరిస్తూ ఉండే సర్పాలు, నీరు పెరగడంతో ఎటెళ్లాలో తెలియక జనావాసాల్లోకి వస్తున్నాయి. తన ఇంట్లో పామును చూసి భయపడిన బెనర్జీ, ఇరుగు పొరుగు వారికి విషయం చెప్పడంతో వారు వచ్చి పామును కర్రలతో కొట్టి చంపారు. విషసర్పాలతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకు వస్తుందోనని భయపడుతున్నట్టు నిర్వాసితులు వ్యాఖ్యానించారు.