mohan lal: 'ఒడియన్'గా మోహన్ లాల్ అదరగొట్టేస్తున్నాడు

  • మోహన్ లాల్ తాజా చిత్రంగా 'ఒడియన్'
  • మాణిక్యన్ పాత్రలో డిఫరెంట్ లుక్ 
  • అత్యధిక బడ్జెట్ తో రూపొందుతోన్న చిత్రం  

మొదటి నుంచి కూడా మోహన్ లాల్ విభిన్నమైన కథా చిత్రాలను చేస్తూ వస్తున్నారు. ఈ కారణంగానే ఆయన ఖాతాలో సక్సెస్ ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. తాజాగా ఆయన మరో వైవిధ్యభరితమైన సినిమా చేస్తున్నారు. మలయాళ సినీ చరిత్రలోనే అత్యధిక భారీ బడ్జెట్ తో .. 'ఒడియన్' పేరుతో ఈ సినిమా రూపొందుతోంది.

 శ్రీకుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్లో మోహన్ లాల్ డిఫరెంట్ లుక్స్ తో కనిపిస్తున్నారు. ఒక ప్రాచీన విద్యను ప్రదర్శించే యోధుడిగా మాణిక్యన్ పాత్రలో మోహన్ లాల్ కనిపించనున్నారు. 'ఒడియన్'గా ఊరి మంచి కోసం ఆయన ఏం చేశాడనేది ఉత్కంఠభరితంగా ఉంటుందట. ఫోటోగ్రఫీ అద్భుతంగా ఉందనే విషయం ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. సస్పెన్స్ థ్రిల్లర్ తో కూడిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్, మోహన్ లాల్ కి మరో హిట్ ఇవ్వడం ఖాయమనిపిస్తోంది.

mohan lal
  • Error fetching data: Network response was not ok

More Telugu News