Asha Saini: ఈ ఫొటో నాదే... లైంగిక వేధింపుల తరువాత ఇలా ఉన్నాను: నటి ఆశా షైనీ

  • పలు తెలుగు చిత్రాల్లో నటించిన ఆశా షైనీ
  • 2007 వాలెంటైన్స్ డే నాడు వేధింపులు
  • బాలీవుడ్ నిర్మాత గౌరంగ్ దోషి వేధించాడన్న ఆశా షైనీ

ఆశా శైనీ గుర్తుందా? 2000 సంవత్సరం ప్రారంభంలో టాలీవుడ్ లో 'నరసింహా నాయుడు', 'నువ్వు నాకు నచ్చావ్‌', 'ఆ ఇంట్లో', 'సర్దుకుపోదాం రండి' వంటి హిట్ చిత్రాల్లో నటించిన అందాల భామ. ఆ తరువాత ఫ్లోరా షైనీగా పేరు మార్చుకుని బాలీవుడ్ లో అవకాశాలను వెతుక్కుంటూ వెళ్లినా, అప్పుడప్పుడూ తెలుగు తెరపై కనిపించింది.

ప్రస్తుతం భారత చిత్ర పరిశ్రమలో 'మీటూ' ఉద్యమం జోరుగా సాగుతున్న వేళ, తన కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న లైంగిక వేధింపులను ఆమె పంచుకుంది. ప్రేమ పేరిట తనను వేధించిన బాలీవుడ్ నిర్మాత గౌరంగ్ దోషి, తనను తీవ్రంగా హింసించాడంటూ అప్పటి ఫొటోను షేర్ చేసుకుంది. 2007 ప్రేమికుల రోజున ఈ ఘటన జరిగిందని చెబుతూ, ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న విషయం, ఇప్పుడు ప్రకంపనలు పుట్టిస్తోంది.

'దీవార్', 'ఆంఖే' వంటి హిట్ చిత్రాలను నిర్మించిన గౌరంగ్, తనను ప్రేమించాడని, కానీ, వాలంటైన్స్ డే తన జీవితంలో ఓ దుర్దినమైందని వాపోయింది. తన సర్వస్వం దోచుకుని, చావగొట్టాడని, ఆ రోజే చచ్చిపోతానని అనిపించిందని చెప్పాడు. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన తాను, విషయాన్ని బయట పెడితే, అవకాశాలు రావని బెదిరించాడని, తాను ఆడిషన్స్ కు వెళితే, తిరస్కరించేలా చేసేవాడని, ఎన్నో అవకాశాలను తాను చేజార్చుకున్నానని చెప్పింది. ఈ విషయాన్ని ఎందుకు బయట పెట్టానా? అని చాలాసార్లు బాధపడ్డానని, గౌరంగ్ ఎంతో మందిని ఇలానే మోసం చేశాడని తనకు తెలిసిందని, వారెవరూ అప్పట్లో ముందుకొచ్చి, తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోలేదని తన ఫేస్ బుక్ లో ఫ్లోరా షైనీ రాసుకొచ్చింది. నేడు పరిస్థితి మారినందునే విషయాన్ని వెల్లడించానని చెప్పింది.

Asha Saini
Flora Sainy
Harrasment
Tollywood
Bollywood
Gourand Doshi
  • Error fetching data: Network response was not ok

More Telugu News