Indian Railway: రైల్వే ఉద్యోగులకు బంపర్ బోనస్.. 78 రోజుల బోనస్‌కు రైల్వే బోర్డు ప్రతిపాదన

  • 12.26 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి
  • ఒక్కొక్కరికీ రూ. 18 వేల బోనస్
  • కొందరికి మాత్రమే వర్తింపు

రైల్వే ఉద్యోగులకు ఈసారి 78 రోజుల దసరా బోనస్ లభించనుంది. ఈ మేరకు రైల్వే యూనియన్లతో జరిగిన చర్చలు ఫలప్రదం అయ్యాయి. ఉత్పాదకత ఆధారంగా 78 రోజులకు బోనస్ ఇవ్వాలని బోర్డు ప్రతిపాదించింది.  అయితే, ఈ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. బోర్డు ప్రతిపాదనతో రూ.12.26 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. ఒక్కొక్కరికీ సుమారు రూ. 18 వేల బోనస్ లభించనుంది. అయితే, గెజిటెడ్ ఉద్యోగులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ఆర్పీఎఫ్ స్పెషల్ ఫోర్స్‌కు చెందిన ఉద్యోగులకు ఈ పీఎల్‌బీ బోనస్ వర్తించదు. రైల్వే బోర్డు నిర్ణయంతో ప్రభుత్వంపై రూ.2 వేల కోట్ల భారం పడనుంది.

Indian Railway
Dasara
Bonus
Railway Board
Cabinet
  • Loading...

More Telugu News