Nithin bale: బాలీవుడ్ ప్రముఖ గాయకుడు నితిన్ బాలి మృతి

  • నిన్న రాత్రి రోడ్డు ప్రమాదం
  • చికిత్స చేసి డిశ్చార్జ్ చేసిన వైద్యులు
  • నేటి ఉదయం కన్నుమూత

‘నా జానే’అంటూ సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టి... ‘నిలె నిలె అంబర్‌ పర్‌’ రీమిక్స్ పాటతో పేరు తెచ్చుకున్న బాలీవుడ్ గాయకుడు నితిన్ బాలి ఇకలేరు. బాలీవుడ్ ప్రముఖ గాయకుడు, టీవీ నటి రోమా బాలి భర్త నితిన్ బాలి కన్నుమూశారు. నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన నితిన్ నేటి ఉదయం మృతి చెందారు. ముంబయ్, మాలద్ నుంచి బొరివిల్లిలో ఉన్న తన నివాసానికి వెళుతున్న క్రమంలో నితిన్ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆయన తలకు, ముఖానికి గాయాలయ్యాయి.

ఆస్పత్రికి తీసుకెళ్లగా గాయాలకు చికిత్స చేసి వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఇంటికి చేరుకున్న వెంటనే నితిన్‌ రక్తపు వాంతులు చేసుకున్నారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. రక్తపోటు తీవ్ర స్థాయికి చేరిందని, ఒక్కసారిగా హార్ట్‌ రేటు పడిపోయిందని వారు తెలిపారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ని తిరిగి ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే నితిన్ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. నితిన్‌ అంత్యక్రియలు రేపు జరిగే అవకాశముంది.

Nithin bale
Bollywood Singer
Roma Bali
Expired
Car Accident
  • Loading...

More Telugu News