maoist: భార్య వినోదినితో కలసి పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు 'మాస్టర్ బ్రెయిన్' పురుషోత్తం

  • హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఎదుట లొంగుబాటు
  • అనారోగ్య కారణాలతో అడవిని వీడిన పురుషోత్తం
  • వీరిపై రూ. 8 లక్షల వరకు రివార్డు ఉంది

మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు పురుషోత్తం అలియాస్ రవి, ఆయన భార్య వినోదిని అలియాస్ భారతక్క లొంగిపోయారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఎదుట వీరు లొంగిపోయారు. మావో అగ్రనేతలు ఆర్కే, గణపతి, కిషన్ లతో కలసి పురుషోత్తం 25 ఏళ్లు పని చేశారు. మావోయిస్ట్ పార్టీ మాస్టర్ బ్రెయిన్ గా ఈయనకు పేరుంది. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ ప్రచార కమిటీ సెక్రటరీగా పురుషోత్తం పని చేస్తున్నారు. అనారోగ్య కారణలతో అడవిని వదిలిపెట్టి, జనజీవన స్రవంతిలోకి వచ్చారు. వీరిపై రూ. 8 లక్షల వరకు రివార్డు ఉంది.

maoist
purushotham
vinodini
surrender
  • Loading...

More Telugu News