Undavalli: ముఖ్యమంత్రి చంద్రబాబు నిజాలు మాట్లాడాలి : ఉండవల్లి అరుణ్‌కుమార్‌

  • ప్రకృతి సేద్యంపై ప్రసంగాన్ని ప్రభుత్వ పోర్టల్‌లో పెట్టక పోవడానికి కారణం ఏమిటి?
  • సిఫ్‌ సంస్థతో ఎంఓయూలో మతలబు ఏమిటో చెప్పాలి
  • పోలవరాన్ని జనానికి చూపించేందుకు రూ.20 కోట్ల వ్యయం దారుణం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పటికైనా నిజాలు మాట్లాడాలని, ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రకృతి సేద్యంపై ఐక్యరాజ్య సమితి వేదికగా ప్రసంగించడాన్ని గొప్పగా చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం, అది అధికారిక కార్యక్రమం అయితే దాన్ని ప్రభుత్వ పోర్టల్‌లో ఎందుకు పెట్టలేదో వెల్లడించాలని కోరారు.

జీరో బడ్జెట్‌ పేరుతో ప్రకృతి సేద్యం గురించి వివరించి సిఫ్‌ సంస్థతో రూ.16,600 కోట్లకు ఎంఓయూ కుదుర్చుకునే అవసరం ఏమొచ్చిందన్నారు. దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాలకు వచ్చిన పెట్టుబడుల్లో 20 శాతం మనకే వచ్చాయని, 18.5 లక్షల కోట్ల ఎంఓయూలు చేసుకున్నామని చెబుతున్న చంద్రబాబు పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేసి జనం అనుమానాలు తీర్చాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు జనాన్ని తీసుకువెళ్లేందుకు రూ.20 కోట్లు ఖర్చు చేయడం దారుణమన్నారు. ఇదే విషయంపై ఏపీ రైతు సాధికార  సంస్థను ప్రశ్నిస్తే ఆర్‌టీఐలోని సెక్షన్‌-8 ప్రకారం వివరాలు ఇవ్వడం కుదరదని చెప్పారని వివరించారు. ఈ మొత్తం వ్యవహారాలపై ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు స్పందించాలని విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News