sabarimala: శబరిమలపై రివ్యూ పిటిషన్లను ఇప్పుడే విచారించలేం: సుప్రీంకోర్టు

  • సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్లు
  • నిర్దిష్టమైన సమయంలోనే పిటిషన్లను విచారిస్తామన్న సుప్రీం
  • కోర్టు తీర్పును అమలు చేస్తామన్న కేరళ సీఎం

శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి అన్ని వయసుల స్త్రీలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును పలు మహిళా సంఘాలు హర్షిస్తుండగా, హిందూ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ తీర్పుపై సుప్రీంలో రివ్యూ పిటిషన్ లు దాఖలయ్యాయి.

అయితే ఈ రివ్యూ పిటిషన్లను తక్షణమే విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. నిర్దిష్ట సమయంలోనే రివ్యూ పిటిషన్లను విచారిస్తామని చెప్పింది. మరోవైపు, కోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయబోమని, కోర్టు తీర్పును అమలు చేసేందుకు చర్యలు చేపడతామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు.

sabarimala
Supreme Court
review petetion
  • Loading...

More Telugu News