Virat Kohli: బిర్యానీకి చెక్ పెట్టిన కోహ్లీ.. శాకాహారిగా మారిన పరుగుల వీరుడు!

  • ఇష్టమైన మాంసాహారాన్ని వదిలేసిన కోహ్లీ
  • కోహ్లీ డైట్‌లోకి కూరగాయలు, సోయా
  • ఫలితం వచ్చిందన్న స్నేహితులు

బిర్యానీ అంటే పడిచచ్చే టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ శాకాహారిగా మారిపోయాడా? అవుననే అంటున్నారు ఆయన సన్నిహితులు. నాలుగు నెలల క్రితమే కోహ్లీ మాంసాహారం మానేసి శాకాహారిగా మారిపోయాడని తెలిపారు. మాంసాహారం మానేసిన తర్వాతే కోహ్లీ మరింత దృఢంగా తయారయ్యాడని చెబుతున్నారు.

ఫిట్‌నెస్‌పై ఎక్కువగా దృష్టి పెట్టే కోహ్లీ డైట్‌లోకి ఇప్పుడు కూరగాయలు, సోయా, ప్రోటీన్లతో కూడిన ఆహార పదార్థాలు వచ్చి చేరినట్టు పేర్కొన్నారు. కొత్త డైట్ ప్రారంభించిన తర్వాత కోహ్లీ జీర్ణశక్తి పెరిగిందని అతడి సన్నిహితులు పేర్కొన్నారు. మరోవైపు కోహ్లీ సతీమణి అనుష్క శర్మ కూడా శాకాహారిగా మారిందట. 

Virat Kohli
Fitness
Non-veg
Vegetable
Anushka Sharma
  • Loading...

More Telugu News