natwar thakkar: ‘నాగాలాండ్ గాంధీ’ నట్వర్ థక్కర్ ఇకలేరు

  • అనారోగ్యంతో నట్వర్ థక్కర్ (86) మృతి
  • గాంధీ సిద్ధాంతాలు, శాంతిని ప్రచారం చేసిన నట్వర్
  • నట్వర్ కు భార్య లెంటినా, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు

‘నాగాలాండ్ గాంధీ’గా ప్రసిద్ధి కెక్కిన నట్వర్ థక్కర్ (86) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గువహటిలో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందారు. ఈ విషయాన్ని థక్కర్ కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన ఆరోగ్యం విషమించడంతో గత నెల 19న గువహటిలోని ఓ ఆసుపత్రిలో చేర్పించామని, మొదట్లో కొద్దిగా కుదుటపడినా.. హఠాత్తుగా బీపీ లెవెల్స్ పడిపోయాయని, కిడ్నీలూ దెబ్బతినడంతో చనిపోయినట్టు చెప్పారు. ఆయనకు భార్య లెంటినా, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

ఇదిలా ఉండగా, నట్వర్ థక్కర్ స్వస్థలం మహారాష్ట్ర. 1955లో ఆయన నాగాలాండ్ వెళ్లారు. అప్పటి నుంచి ఆయన అక్కడే ఉండిపోయారు. గాంధీ సిద్ధాంతాలు, శాంతిని ప్రచారం చేసిన ఆయన చుచుయిమ్లాంగ్ లో 'నాగాలాండ్ గాంధీ' ఆశ్రమాన్ని స్థాపించారు. 'నాగాలాండ్ గాంధీ’ గా ప్రసిద్ధి చెందిన ఆయన్ని పద్మశ్రీ పురస్కారంతో భారత ప్రభుత్వం సత్కరించింది.

natwar thakkar
nagaland gandhi
  • Loading...

More Telugu News