Venkaiah Naidu: వెంకయ్యనాయుడు చేతుల మీదుగా రామినేని పురస్కారాల ప్రదానం

  • డాక్టర్ రామినేని ఫౌండేషన్ 19వ వార్షికోత్సవం
  • పుల్లెల గోపీచంద్ కు విశిష్ట పురస్కారం
  • గరికపాటి, నాగ్ అశ్విన్, చొక్కాపు వెంకటరమణకు విశిష్ట పురస్కారాలు

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా రామినేని పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన ప్రముఖులకు ఈ పురస్కారాలను అందజేశారు. డాక్టర్ రామినేని ఫౌండేషన్ 19వ వార్షికోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో ఓ కార్యక్రమం నిర్వహించారు.

బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ కు రామినేని విశిష్ట పురస్కారాన్ని వెంకయ్యనాయుడు అందజేశారు. అదే విధంగా మహాసవస్రావధాని గరికపాటి నరసింహారావుకు, ప్రముఖ సినీ దర్శకుడు నాగ్ అశ్విన్ కు, బాలసాహితీవేత్త చొక్కాపు వెంకటరమణకు విశేష పురస్కారాలను అందజేశారు. విశిష్ట పురస్కారం కింద రూ.2 లక్షలు, విశేష పురస్కారం కింద లక్ష రూపాయలను వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ కపిల్ దేవ్, ఏపీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపీ మాగంటి బాబు, మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

అనంతరం, వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, సన్మాన గ్రహీతలందరికీ తన అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. అందరికీ స్ఫూర్తి పుల్లెల గోపీచంద్ అని, ప్రపంచస్థాయిలో భారత్ పేరును చాటిచెప్పేలా చేశారని కొనియాడారు. ముక్కుసూటిగా, నిర్మొహమాటంగా, మనసుకు హత్తుకునేలా... మనందరినీ ఆలోచింపజేసేలా వ్యాఖ్యానం చేసే డాక్టర్ గరికపాటి నరసింహారావు అని కొనియాడారు.

ఇటీవల కాలంలో చాలా చక్కటి సినిమాను రూపొందించిన యువ దర్శకుడు నాగ్ అశ్విన్.. పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ‘మహానటి’ సావిత్రిని మన కళ్ల ముందు సాక్షాత్కరింపజేశారని ప్రశంసించారు. పిల్లలకు మంచి సాహిత్యం, కథలను అందించే చొక్కాపు వెంకట రమణ ఈ గౌరవ పురస్కారం అందుకోవడం చాలా సంతోషమని అన్నారు.

  • Loading...

More Telugu News