chetan bhagat: నా భార్యతో దూరమైనప్పుడు ఆ యువతికి దగ్గరయ్యా.. అక్రమ సంబంధం మాత్రం పెట్టుకోలేదు!: వివరణ ఇచ్చిన చేతన్ భగత్

  • భార్య అనుషాకు క్షమాపణలు చెప్పిన చేతన్
  • ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది
  • ఫేస్ బుక్ లో సందేశం పోస్ట్ చేసిన రచయిత

మహిళలను లైంగిక వేధింపులకు గురిచేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ నవలా రచయిత చేతన్ భగత్ స్పందించాడు. ఆ సందేశాలు తన వాట్సాప్ నుంచే వెళ్లాయని అంగీకరించాడు. ఆ తరహా ప్రవర్తనకు తొలుత తన భార్య అనూషాతో పాటు మరో యువతికి క్షమాపణలు చెబుతున్నట్లు వెల్లడించాడు. వాట్సాప్ సందేశాలు బయటపెట్టిన సదరు యువతితో తనకు మంచి స్నేహం ఉందని చేతన్ భగత్ చెప్పుకొచ్చాడు. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో సందేశాన్ని పోస్ట్ చేశాడు.

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన స్క్రీన్ షాట్లు నిజమైనవేననీ, ఇందుకు అనూషాను క్షమాపణలు కోరుతున్నానని తెలిపాడు. తాను సందేశాలు పంపిన అమ్మాయి మంచిదనీ, అందంగా ఉంటుందని సెలవిచ్చాడు. తామిద్దరం గతంలో చాలాసార్లు కలుసుకున్నామన్నాడు. తనకు పెళ్లి అయినప్పటికీ గత కొంతకాలంగా భార్యతో కనెక్టివిటీని మిస్సయ్యాననీ,  అప్పుడే ఆ యువతికి కనెక్ట్ అయ్యాయని చెప్పాడు. ఆ యువతి కూడా తనతో మెంటల్ గా కనెక్ట్ అయిందని అన్నాడు.

తమిద్దరి మధ్య ఎలాంటి వివాహేతర సంబంధం లేదని తేల్చిచెప్పాడు. ఏదేమైనా ఆ అమ్మాయితో తన వ్యక్తిగత విషయాలు, అభిప్రాయాలు పంచుకుని ఉండాల్సింది కాదని వ్యాఖ్యానించాడు. తాను ఆమెకు అసభ్యకర ఫొటోలు, వీడియోలు పంపలేదని స్పష్టం చేశారు. తనను కలిసిన వారిలో సదరు యువతి ప్రత్యేకంగా అనిపించిందని చేతన్ భగత్ అన్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలోఈ రచయిత పై అన్ని వర్గాల ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు.

chetan bhagat
sexual harrasment
wife
anusha
Facebook
Social Media
  • Loading...

More Telugu News