Nani: ఫిట్ నెస్ రహస్యం గురించి అడిగితే మాత్రం నాకు తిక్కరేగిపోతుంది!: అక్కినేని నాగార్జున

  • టీవీ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన నాగ్
  • టీవీ చూడనని, పేపర్ చదవనని వ్యాఖ్య
  • నానితో పోటీపడి నటించాల్సి వచ్చిందన్న హీరో

అక్కినేని నాగార్జున, నాని ప్రధాన పాత్రల్లో నటించిన దేవదాస్ చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఓ టీవీ ఛానల్ లో నిర్వహించిన ఇంటర్వ్యూలో నాగార్జున పలు అంశాలపై మాట్లాడారు. తాను అసలు పేపర్ చదవననీ, టీవీ చూడనని నాగార్జున తెలిపారు.

‘మీ ఫిట్ నెస్ రహస్యం ఏంటి?’ అని ఎవరైనా అడిగితే తనకు పిచ్చ కోపం వస్తుందని అన్నారు. తాను ఎక్కడికి వెళ్లినా ఇదే ప్రశ్న రిపీటవుతూ ఉంటుందని వ్యాఖ్యానించారు. దీనికి తోడుగా తన గురించి ప్రస్తావించాల్సి వస్తే 59 ఏళ్ల నాగార్జున అంటూ చెబుతారని వ్యంగ్యంగా స్పందించారు. ఇది తన ఒక్కడికి మాత్రమే జరుగుతోందని సరదాగా చెప్పారు. మల్టీ స్టారర్ మూవీ కావడంతోనానితో పోటీ పడి నటించాల్సి వచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత అశ్వనీదత్ కూడా పాల్గొన్నారు.

Nani
Nagarjuna
Tollywood
devadas
tv9
interview
  • Loading...

More Telugu News