Vijayawada: బెజవాడ కనకదుర్గమ్మకు బంగారు త్రిశూలం.. హైదరాబాద్ భక్తుడి బహూకరణ!

  • రూ.12 లక్షలతో అమ్మవారికి స్వర్ణ త్రిశూలం
  • బహూకరించిన బోడుప్పల్ భక్తుడు
  • అన్నదానానికి రూ.2 లక్షల విరాళం ఇచ్చిన దేవినేని అవినాష్

విజయవాడ కనకదుర్గమ్మకు హైదరాబాద్‌కు చెందిన ఓ భక్తుడు స్వర్ణ త్రిశూలాన్ని బహూకరించాడు. బోడుప్పల్‌కు చెందిన దుర్గా ఎంటర్‌ప్రైజెస్ అధినేత కొత్త పాండు-దుర్గమ్మ దంపతులు అమ్మవారి భక్తులు. శనివారం కుటుంబ సభ్యలుతో కలసి దుర్గమ్మను దర్శించుకున్న వీరు  ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రూ.12 లక్షల ఖర్చుతో తయారు చేయించిన బంగారు త్రిశూలాన్ని అమ్మవారికి బహూకరించారు. మరోవైపు, తెలుగు యువత రాష్ట్ర నేత దేవినేని అవినాష్ కుటుంబ సమేతంగా శనివారం దుర్గమ్మను దర్శించుకున్నారు. తన తండ్రి దేవినేని  రాజశేఖర్ (నెహ్రూ) పేరు మీద ఆలయంలో భక్తుల అన్నదానం కోసం రూ.2,01,116లను విరాళంగా అందించారు.

Vijayawada
Kanaka durga
Hyderabad
devineni avinash
  • Loading...

More Telugu News