Narendra Modi: స్వచ్ఛ భారత్ పేరుతో బ్యాంకులను ఊడ్చేస్తున్న మోదీ: విరుచుకుపడిన ఎంపీ రామ్మోహన్‌నాయుడు

  • ప్రత్యేక హోదా అడిగితే రక్షణ నిధులు ఇవ్వాలా అంటారా?
  • మీరు దేశానికి ప్రధానా? లేక, కార్పొరేట్ సంస్థలకా?
  • రాఫెల్ డీల్‌పై మాట్లాడడం లేదెందుకు?

ప్రధాని నరేంద్రమోదీపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ రక్షణకు అంత్యంత కీలకమైన అంశాలపై నోరెందుకు మెదపడం లేదని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌కు  ప్రత్యేక హోదా అడిగితే రక్షణ రంగం నుంచి నిధులు ఇవ్వాలా? అని ఎద్దేవా చేసిన ప్రధాని రాఫెల్ డీల్‌పై ఎందుకు పెదవి విప్పడం లేదని నిలదీశారు. స్వచ్ఛ భారత్ పేరుతో తెరవెనుక బ్యాంకులను ఊడ్చేస్తున్నారని ఆరోపించారు.

 మోదీ తీరు చూస్తుంటే ఆయన కార్పొరేట్ సంస్థలకే తప్ప దేశానికి ప్రధాని కాదన్న విషయం అర్థమవుతోందన్నారు. బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టిన వారిని సురక్షితంగా దేశం దాటిస్తున్నారని ఆరోపించారు.  ఇకనైనా మోదీ మౌనం వీడాలని కోరారు. జీఎస్టీ అమలు వల్ల నష్టపోయిన చిన్న వ్యాపారులను ఆదుకోవాలని రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు.

Narendra Modi
Rammohan Naidu
Telugudesam
BJP
Andhra Pradesh
  • Loading...

More Telugu News