nagarjuna: 'దేవదాస్' వారం రోజులలో 41 కోట్లు రాబట్టడం హ్యాపీగా వుంది: నాగార్జున

  • మల్టీ స్టారర్ అనగానే అలా అనుకుంటారు 
  • నేను .. నాని అలా ఆలోచించలేదు
  • ఇంతమంచి సినిమా రావడానికి ఇదో కారణం 

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జున .. నాని కథానాయకులుగా 'దేవదాస్' సినిమా తెరకెక్కింది. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమా, సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డాన్ గా నాగార్జున .. డాక్టర్ గా నాని పండించిన కామెడీ అందరికీ నచ్చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా టీమ్ మీడియా మీట్ ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నాగార్జునతో పాటు అశ్వనీదత్ .. శ్రీరామ్ ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.

ఈ మీడియా మీట్ లో నాగార్జున మాట్లాడుతూ .. 'దేవదాస్' సినిమాకి వారం రోజుల్లో 41కోట్ల గ్రాస్ వచ్చిందని అశ్వనీదత్ గారు చెబితే చాలా ఆనందంగా అనిపించింది. ఈ శని .. ఆదివారాలతో వసూళ్లు మరింతగా పెరుగుతాయని భావిస్తున్నాను. సాధారణంగా మల్టీ స్టారర్ మూవీస్ అనగానే ఎవరి పాత్ర ఎక్కువసేపు ఉంటుందని ఆలోచిస్తూ వుంటారు. నేను .. నాని ఆ విధంగా ఆలోచించకపోవడం వలన, ఇంతమంచి సినిమా వచ్చింది" అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.   

  • Loading...

More Telugu News